ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 6 జూన్ 2022 (07:22 IST)

ఉత్తరాఖండ్‌లో విషాదం - చార్‌ధామ్ వద్ద లోయలోపడిన బస్సు

char dham yatra
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో తీరని విషాదం చోటుచేసుకుంది. చార్‌ధాయ్ యాత్రకు వెళ్లి బస్సు ఒకటి లోయలోపడిపోయింది. ఈ ప్రమాదంలో 22 మంది మృత్యువతాపడ్డారు. మరికొంతమంది గాయపడ్డారు ఈ ప్రమాదం శనివారం రాత్రి జరిగింది. 
 
మొత్తం 30 మంది ప్రయాణికులతో మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి చార్‌ధామ్ యాత్రకు వెళుతున్నారు. ఈ బస్సు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని దమ్తా ప్రాంతంలో యమునోత్రి జాతీయ రహదారిపై వెళుతుండగా, ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద స్థలంలోనే 22 మంది మృత్యువాతపడ్డారు. 
 
ఈ ప్రమాద వార్త తెలియగానే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోం అమిత్ షా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. భక్తులతో వెళుతున్న బస్సు లోయలో పడిపోవడం విషాదకరమన్నారు. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి థామీతో మాట్లాడినట్టు అమిత్ షా వెల్లడించారు. ఈ ప్రమాదంలో ఎన్డీఆర్ఎఫ్ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు.