బుధవారం, 22 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 28 మే 2022 (19:24 IST)

టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ.. చంద్రబాబూ.. మీరో చార్లెస్‌ శోభరాజ్‌?

Vijaysaireddy
టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ అని, చర్చల కోసం దొంగల ముఠా నాయకుడు చంద్రబాబు నాయుడు వచ్చినా తాము సిద్ధమేనని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి తెలిపారు. మంగళవారం పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పలు సంచలన అంశాలు వెల్లడించారు. ప్రధానితో భేటీ అంశాంలో టీడీపీ ఎంపీ సీఎం రమేశ్‌ విసిరిన సవాలును స్వీకరిస్తున్నానని విజయసాయిరెడ్డి చెప్పారు. 
 
ప్రజా సమస్యల గురించి ప్రధానిని కలిస్తే తనను విమర్శిస్తున్న టీడీపీ నేతలు.. ఇవాళ రాజ్యసభలో జరిగినదానికి ఏం సమాధానం చెబుతారని విజయసాయిరెడ్డి అన్నారు. ఒకవైపు ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టి, ఇంకోవైపు ప్రధాని మోదీతో, కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీతో వీళ్లు ఏం మంతనాలు చేస్తున్నారు? ఏకంగా జైట్లీ కాళ్లు మొక్కాల్సిన అవసరం ఏమొచ్చింది? రాజ్యసభ సీసీటీవీ ఫుటేజీల్లో టీడీపీ ఎంపీల బాగోతమంతా రికార్డైంది. ఆ ఫుటేజీని సర్టిఫై చేయించి, సెక్రటరీ సంతకంతో బయటపెడితే టీడీపీ గుట్టు రట్టవుతుందని విజయసాయిరెడ్డి అన్నారు.
 
అందితే జుట్టు, లేకపోతే కాళ్లు పట్టుకోవడం చంద్రబాబుతోపాటు టీడీపీ నాయకుల నైజమని విజయసాయి అన్నారు. "చంద్రబాబూ.. మీరో చార్లెస్‌ శోభరాజ్‌. మీ అంత దుర్మార్గపు నాయకుడు ఈ దేశంలోనే లేరు. ముఖ్యమంత్రి పదవిలో కొనసాగే నైతిక అర్హత మీకు లేనేలేదు" అని మండిపడ్డారు.