మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 25 మే 2017 (13:10 IST)

సీఎం ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ల్యాండ్ క్రాష్...

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఒకటి ల్యాండ్ క్రాష్ అయింది. నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే హెలికాఫ్టర్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్ హెలికాఫ్టర్‌ను అత్యంవసరంగా భూ

మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ఒకటి ల్యాండ్ క్రాష్ అయింది. నింగిలోకి ఎగిరిన కొద్దిసేపటికే హెలికాఫ్టర్‌ ఇంజిన్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో పైలట్  హెలికాఫ్టర్‌ను అత్యంవసరంగా భూమిపై ల్యాండ్ చేశాడు. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ స్వల్పంగా దెబ్బతినగా, అందులో ఉన్నవారంతా సురక్షితంగా బయటపడ్డారు. 
 
ఈ హెలికాఫ్టర్‌లో మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌తో పాటు.. మరికొందరు నేతలు, అధికారులు ఉన్నారు. వీరంతా ప్రయాణిస్తున్న హెలికాప్టర్ లాతూర్ వద్దకు చేరుకోగానే కూలిపోయినట్టు స్వయంగా దేవేంద్ర ఫడ్నవిస్ ట్విటర్లో పోస్టు చేశారు. ‘‘లాతూర్‌లో మా హెలికాప్టర్ యాక్సిడెంట్‌కు గురైంది. అయితే నేను, నాతో పాటు ఉన్న బృందం అందరూ పూర్తి క్షేమంగా బయటపడ్డాం. కంగారు పడాల్సిన అవసరం లేదు’’ అని ట్వీట్ చేశారు. 

కాగా, హెలికాప్టర్ ఇంజన్‌లో లోపం కారణంగా పైలట్ దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఈ ఘటనలో చాపర్ ఓ గోడను ఢీకొట్టింది. దీంతో దాని వెనుక భాగం తీవ్రంగా దెబ్బతింది. రెక్కలు విరిగిపోయాయి. ఇందులో ప్రయాణిస్తున్న వారంతా తృటిలో బయటపడ్డారు. ఇదే హెలికాప్టర్‌లో పది రోజుల క్రితం కూడా సాంకేతిక లోపం ఏర్పడింది.