శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : బుధవారం, 3 ఏప్రియల్ 2019 (10:19 IST)

భార్య ప్రియుడితో లేచిపోయింది.. అంతే కుమార్తెలతో కలిసి అధ్యాపకుడు ఏం చేశాడంటే?

భార్య అంటే ఆ అధ్యాపకుడికి పంచప్రాణాలు. ఆమెపై అంతులేని ప్రేమను కలిగివున్నాడు. కానీ ఆమెకు మాత్రం ప్రియుడంటే మోజు. అందుకే ప్రియుడితో అక్రమ సంబంధం ఏర్పరుచుకుని.. అతని కోసం ఇంటి నుంచి పారిపోయింది. దీంతో మనస్తాపానికి గురైన అధ్యాపకుడు.. పిల్లలను ముందుగా ఉరేసి చంపేశాడు. ఆపై అతడు కూడా ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన మహారాష్ట్ర సరిహద్దు పట్టణమైన బల్లార్‌పూర్‌లో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. రుషికాంత్ (40) ప్రైవేటు ఐటీఐలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నాడు. భార్య, ఇద్దరు పిల్లలు నారాయణి (5), కార్తిని (2)తో ఉన్నంతలో హాయిగా సాగిపోతున్న వీరి కుటుంబంలో భార్య వివాహేతర సంబంధం చిచ్చుపెట్టింది. వారం రోజుల క్రితం భార్య ఇంటి నుంచి వెళ్లిపోవడంతో రుషికాంత్ తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆమెను తిరిగి తీసుకొచ్చేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరికి తీవ్ర నిర్ణయం తీసుకున్నాడు. పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 
 
వాట్సాప్‌లో వచ్చిన ఫొటోలను చూసిన భార్య వెంటనే పోలీసులకు, తన తల్లిదండ్రులకు సమాచారం అందించింది. అయినా రుషికాంత్, నారాయణి, కార్తిని ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.