శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 18 ఫిబ్రవరి 2022 (18:30 IST)

మహిషాసురుడిగా ప్రధాని మోదీ.. మహిషాశుర మర్దినిగా మమత!

పశ్చిమ బెంగాల్‌లోని మదనాపూర్‌ జిల్లాలో ఏర్పాటు చేసిన పోస్టర్ వివాదానికి దారితీసింది. ఈ పోస్టర్‌లో మహిషాసురుడిగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ..  మహిషాశుర మర్దిని దుర్గాదేవిగా బెంగాల్ సీఎం మమత బెనర్జీ వున్నారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా మదనాపూర్ జిల్లా మిడ్నాపూర్‌లో తృణమూల్ పార్టీ అభ్యర్థి అనిమా సాహా ఈ పోస్టర్‌ను ఏర్పాటు చేసినట్లుగా ప్రచారం జరుగుతోంది. 
 
కానీ ఇది ఎవరు పెట్టారు అనేదానిపై ఎవ్వరు నోరు మెదపటంలేదు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. బెంగాల్‌లో వివాదానికి కేరాఫ్ అడ్రస్ గా మారిందీ పోస్టర్. ఈ ఫోటోలో మోదీతో పాటు అమిత్ షాను కూడా రాక్షసుడిగా చూపించారు.
 
దీనిపై స్థానిక బీజేపీ నేత విపుల్ ఆచార్య మండిపడ్డారు. సనాతన ధర్మానికి, ప్రధాని మోదీ, అమిత్ షాకి ఇది తీవ్ర అవమానమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు.