మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By జెఎస్కే
Last Modified: విజ‌య‌వాడ‌ , బుధవారం, 19 జనవరి 2022 (09:33 IST)

ఇంద్రకీలాద్రిపై కరోనా అలెర్ట్ ... అంతరాలయ దర్శనం నిలిపివేత

కరోనా మూడో వేవ్ ప్రారంభం అయిందనే భయం అన్ని చోట్ల మొదలుఅయింది. విజయవాడలోని కనకదుర్గ ఆలయంలో కరోనా ఆంక్షలు అమలు చేస్తున్నట్లు ఆలయ ఈవో భ్రమరాంబ ప్రకటించారు. ఆలయంలో పలు సేవలు పూర్తిగా నిలిపివేసినట్లు తెలిపారు.
 
 
విజయవాడలోని ఇంద్రకీలాద్రిపై భక్తుల రక్షణ కోసం కరోనా ఆంక్షలు విధించినట్లు ఆలయ ఈవో భ్రమరాంబ వెల్లడించారు. ఆలయంలో దుర్గమ్మ అంతరాలయ దర్శనం, శఠారి పూర్తిగా నిలిపివేసినట్లు ప్రకటించారు. దేనితో పాటు అన్ని ఆర్జిత సేవలకు 50 శాతం మాత్రమే భక్తులను అనుమతిస్తున్నట్లు తెలిపారు. దుర్గ దేవి ఆలయంలో ఉచిత ప్రసాదాల పంపిణీ నిలుపుదల చేసినట్లు తెలిపారు. దుర్గమ్మ దర్శనానికి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అవకాశం ఇస్తున్నామని, మాస్కు లేని భక్తులకు అనుమతించడం లేదన్నారు. 
 
 
పరిమితంగా వచ్చే భక్తులకు ఇంద్రకీలాద్రిపై తక్కువ మొత్తంలోనే ప్రసాద విక్రయాలు నిర్వహిస్తున్నట్లు ఈవో భ్రమరాంబ పేర్కొన్నారు. కొవిడ్​ ఉద్ధృతి నేపధ్యంలో ఈ ఆంక్షలు అమలు చేస్తున్నామని, భక్తులు సహకరించాలని ఈవో భ్రమరాంబ కోరారు.