1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 23 సెప్టెంబరు 2016 (11:36 IST)

'వీరజవాన్లు బిచ్చగాళ్లు కాదంటూ హ్యాష్ ట్యాగ్' వైరల్.. మమతా సర్కారుపై విమర్శల దాడి

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లో తీవ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన వీర జవాను కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారాన్ని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు.

జమ్మూకాశ్మీర్ రాష్ట్రంలోని యురీ సెక్టార్‌లో తీవ్రవాదులు జరిపిన దాడిలో అమరుడైన వీర జవాను కుటుంబానికి రూ.2 లక్షల నష్టపరిహారాన్ని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. దీనిపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. 'వీరజవాన్లు బిచ్చగాళ్లు కాదంటూ హ్యాష్ ట్యాగ్' పెట్టిన మెసేజ్ పై తృణమూల్ సర్కారును, మమత తీరును ఎండగడుతున్నారు.
 
ముఖ్యంగా... గత యేడాది మక్కాకు వెళ్లి మరణించిన వ్యక్తికి రూ.10 లక్షల పరిహారాన్ని ఆమె సర్కారు ప్రకటించింది. కానీ, యూరీలోని ఆర్మీ బేస్‌లో ఉగ్రదాడిలో మరణించిన వీరజవాను కుటుంబానికి రూ.2 లక్షల పరిహారం ప్రకటించడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. 
 
ఇప్పటికే మమతా బెనర్జీ రూ.2 లక్షల సాయం, హోంగార్డు ఉద్యోగాన్ని అమరవీరుల కుటుంబాలు తిరస్కరించాయి. ఆ సహాయం తమకు అక్కర్లేదని స్పష్టంచేశాయి. మమతా బెనర్జీ లౌకికవాదానికి ఆమె ప్రకటించిన సాయం నిదర్శనమని, కుహనా రాజకీయాలకు ఈ నిర్ణయం అద్దం పడుతోందని నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.