శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 డిశెంబరు 2016 (12:04 IST)

అరగంట పాటు ఆకాశంలోనే తిరిగిన విమానం.. మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారా?

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారని ఆ పార్టీ మంత్రి ఫిర్హాద్ హకీం అన్నారు. బుధవారం రాత్రంతా ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కా

పశ్చిమ బెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ అధినేత మమతా బెనర్జీని చంపేందుకు కుట్రపన్నారని ఆ పార్టీ మంత్రి ఫిర్హాద్ హకీం అన్నారు. బుధవారం రాత్రంతా ప్రయాణిస్తున్న ప్రైవేట్‌ విమానం ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండ్‌ కాకుండా అరగంట పాటు ఆకాశంలోనే చక్కర్లు కొట్టింది. విమానాశ్రయానికి చేరుకునేందుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్నప్పుడే విమానం ఐదు నిమిషాల్లో ల్యాండవబోతోందని చెప్పాడని కానీ అరగంట తర్వాత ల్యాండైందని హకీం ఆరోపించారు. 
 
పట్నా నుంచి రాత్రి 7.35 గంటల సమయంలో బయలుదేరిన విమానం కోల్‌కతాలో ల్యాండ్‌ నిర్ణీత సమయానికి ల్యాండ్‌ కాలేదు. అరగంట పాటు ఆకాశంలో తిరగాడింది. చివరకు రాత్రి 9 గంటల సమయంలో విమానాశ్రయంలో ల్యాండైంది. ఆ సమయంలో విమానంలో మమతాతో పాటు తృణమూల్‌ కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఫిర్హాద్‌ హకీం కూడా ఉన్నారు. 
 
విమానంలో ఇంధనం అయిపోతోందని పైలట్‌ ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోల్‌కి సమాచారం అందించినా అధికారులు స్పందించలేదన్నారు. దీన్ని బట్టి చూస్తే మమతను చంపేందుకు ప్లాన్ చేసినట్లు ఉందని హకీం తెలిపారు.