బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 3 ఆగస్టు 2018 (09:25 IST)

బీజేపీని అంతం చేయడమే మా లక్ష్యం : మమతా బెనర్జీ

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అంతం చేయడమే తమ అందరి లక్ష్యమని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గా

వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని అంతం చేయడమే తమ అందరి లక్ష్యమని వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. తన ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆమె కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధినేత్రి సోనియా గాంధీలతో సమావేశమయ్యారు. వీరంతా వివిధ అంశాలపై చర్చించారు.
 
ఆ తర్వాత ఆమె మాట్వాడుతూ, దుయి హజార్ ఉన్నీష్, బీజేపీ ఫినిష్ (బెంగాలీ భాషలో 2019-బీజేపీ పని పూర్తి) అన్నదే తమ లక్ష్యమన్నారు. అదేసమయంలో ప్రధాని పదవి కోసం తాను పోటీ పడటం లేదని స్పష్టంచేశారు. ప్రధాని అభ్యర్థిని ప్రతిపక్షాలన్నీ కలిసి ఉమ్మడిగా ఎంపిక చేస్తాయన్నారు. 
 
వచ్చే ఏడాది జనవరి 19న కోల్‌కతాలో నిర్వహించనున్న సభకు రావాలని వారిని ఆహ్వానించారు. రానున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీతో తలపడేందుకు ప్రతిపక్షాలన్నింటికీ ఒక్కతాటిపైకి తేవడం తన మొదటి ప్రాధాన్యమని మమత ప్రకటించారు. ప్రధాని అభ్యర్థి ఎవరో తరువాత నిర్ణయిద్దాం. ముందు బీజేపీని ఓడిద్దాం అని ఆమె చెప్పారు. ఎన్నికల్లో కలిసి పోరాడటం గురించి సోనియా, రాహుల్‌తో చర్చించినట్టు తెలిపారు. వర్తమాన రాజకీయాల గురించి చర్చించినట్టు తెలిపారు.
 
కాగా, ఎన్డీయే భాగస్వామ్య పక్షమైన శివసేన నాయకుడు సంజయ్‌రౌత్ వచ్చి మమతను తృణమూల్ కార్యాలయంలో కలుసుకున్నారు. ప్రతిపక్షాలన్నింటినీ ఒక్కతాటిపైకి తెచ్చేందుకు మమత చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమని బీజేపీ నుంచి సస్పెండ్ అయిన ఎంపీ కీర్తి ఆజాద్ అన్నారు. ఈవీఎంలతో కాకుండా బ్యాలెట్ ఆధారిత ఎన్నికలు నిర్వహించేలా డిమాండ్ చేసేందుకు ప్రతిపక్షాలన్నీ ఎన్నికల సంఘం వద్దకు ఒక ప్రతినిధి బృందాన్ని పంపాలని మమత సూచించారు.