మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : సోమవారం, 10 జులై 2017 (10:46 IST)

వివాహితతో అక్రమ సంబంధం: యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టారు.. ఎక్కడ?

ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. రాజస్థాన్ రాష్ట్రంలో

ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడిని చెట్టుకు కట్టేసి కొట్టిన ఘటన రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. తమ గ్రామానికి చెందిన ఓ వివాహితతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో.. రాజస్థాన్ రాష్ట్రంలోని సికార్ జిల్లా ఓ యువకుడిపై దాడి చేశారు. వివరాల్లోకి వెళితే.. సికార్ జిల్లా జాతాలా గ్రామానికి చెందిన మహిపాల్ సైనీ అనే యువకుడు మావంద కళా గ్రామానికి చెందిన 25 ఏళ్ల వివాహితను కలిసేందుకు వచ్చాడు. 
 
వివాహితతో యువకుడు అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో సైనీని స్థానికులు గ్రామంలోని చెట్టుకు కట్టేసి కొట్టారు. గ్రామస్థులు అందించిన సమాచారంతో పోలీసులు వచ్చి సైనీని రక్షించారు. వివాహిత భర్తతోపాటు భగవాన్ రాం, ఉమ్రావ్, రంజిత్, అశోక్‌లపై కేసు నమోదు చేసి, వారిని అరెస్టు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.