ప్రియురాలిని హత్య చేశాడు.. సొంతింట్లోనే పాతిపెట్టాడు.. పరుపు వేసి నిద్రపోయాడు
ప్రియురాలిని హత్య చేశాడో కిరాతకుడు. సొంత ఇంట్లోనే పూడ్చి పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకున్నాడు. అయితే కోపంలో నోరుజారడంతో జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెంది
ప్రియురాలిని హత్య చేశాడో కిరాతకుడు. సొంత ఇంట్లోనే పూడ్చి పెట్టి ఎవరికీ అనుమానం రాకుండా తప్పించుకున్నాడు. అయితే కోపంలో నోరుజారడంతో జైలు పాలయ్యాడు. వివరాల్లోకి వెళితే... మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌కు చెందిన ఘన్ శ్యామ్ అనే యువకుడు, కాజల్ అనే యువతి లవర్స్. వీరిద్దరి గొడవ జరగడంతో కాజల్ తలపై బలమైన వస్తువుతో ఘన్ శ్యామ్ బాదాడు. తీవ్రంగా గాయపడ్డ ఆమె అక్కడే మృతిచెందింది.
ఇంట్లోనే గుంత తీసి కాజల్ మృతదేహాన్ని అందులో పాతిపెట్టాడు. తవ్విన ఆనవాళ్లు తెలియకుండా ఉండేందుకు పరుపు వేశాడు. రాత్రిళ్లు దానిపైనే నిద్రించాడు. నిన్న పక్కనే ఉన్న ఓ వ్యక్తితో ఘన్ శ్యామ్‌కు గొడవైంది. మాటా మాటా వాదులాటకు దిగడంతో కోపంతో కాజల్‌ను చంపినట్టే చంపి ఇంట్లో పాతిపెడతానని ఘన్ శ్యామ్ హెచ్చరించాడు.
అప్పటికే కాజల్ కనిపించక రోజులు గడుస్తుండటంతో అనుమానం వచ్చిన అతను పోలీసులకు సమాచారం ఇవ్వగా, విచారణలో అసలు నిజం తేలింది. దీంతో ఘన్ శ్యామ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.