శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By chitra
Last Updated : బుధవారం, 28 సెప్టెంబరు 2016 (09:17 IST)

బాలికపై అత్యాచారయత్నం....ఆపై కత్తితో దాడి

అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో ఓ బాలికపై కత్తితో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన న్యూఢిల్లీ నగర శివార్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకీలోని రాంసానేహి ఘాట్ ప్రాంతంలోని పొల

అత్యాచార యత్నాన్ని అడ్డుకుందనే కోపంతో ఓ బాలికపై కత్తితో దాడి చేశాడో యువకుడు. ఈ ఘటన న్యూఢిల్లీ నగర శివార్లలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బారాబంకీలోని రాంసానేహి ఘాట్ ప్రాంతంలోని పొలంలో 14 ఏళ్ల ఓ బాలిక ఒంటరిగా పనిచేస్తుండగా రంజిత్ అనే యువకుడు ఆ బాలికపై కన్నేశాడు. 
 
 ఆ బాలికను పొదల్లోకి లాక్కెళ్లి యువకుడు అత్యాచారం చేసేందుకు యత్నించగా, ఆమె గట్టిగా ప్రతిఘటించింది. దీంతో కోపం కట్టలు తెంచుకున్న ఆ యువకుడు కోపంతో కత్తితో బాలికను కర్కశంగా పొడిచాడు. బాలిక పెట్టిన కేకలు విన్న గ్రామస్థులు సంఘటన స్థలానికి వచ్చి నిందితుడు రంజిత్‌ను కొట్టి అతన్ని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా కత్తిపోట్లకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. బాలిక పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు అంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.