పురుగులున్న పెరుగు తిని తండ్రీకూతుళ్ళు ఆస్పత్రి పాలయ్యారు.. ఎక్కడ?
చెన్నైలో పురుగులున్న పెరుగు తిని ఇద్దరు అస్వస్థతకు గురైయ్యారు. నిన్నటికి నిన్న కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో పురుగులున్నట్లు నిర్ధారించిన పోలీసులు 50వేల లడ్డూలను సీజ్ చేసిన నేపథ్యంలో.. చెన్నై క్రోంపేటలో
చెన్నైలో పురుగులున్న పెరుగు తిని ఇద్దరు అస్వస్థతకు గురైయ్యారు. నిన్నటికి నిన్న కనకదుర్గమ్మ లడ్డూ ప్రసాదంలో పురుగులున్నట్లు నిర్ధారించిన పోలీసులు 50వేల లడ్డూలను సీజ్ చేసిన నేపథ్యంలో.. చెన్నై క్రోంపేటలో పురుగులున్న పెరుగు ఇద్దరిని ఆస్పత్రి పాలు చేసింది.
వివరాల్లోకి వెళితే.. క్రోంపేట ముమ్మూర్తినగర్‌కు చెందిన మోజస్ ప్రైవేటు అంబులెన్స డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. ఈయన కుమార్తె జెన్నిఫర్ కళాశాల్లో చదువుకుంటోంది. శనివారం అదే ప్రాంతంలో ఉన్న ఓ దుకాణంలో 200 గ్రాముల బరువు కలిగిన ఓ ప్రైవేటు కంపెనీకి చెందిన పెరుగు ప్యాకెట్‌ను కొనుగోలు చేశారు.
తండ్రి, కూతుళ్లిద్దరూ పెరుగును కలుపుకొని భోజనం చేశారు. తినే సమయంలో పెరుగులో నల్లరంగుల్లో ఉన్న జలగల తోలు కనిపించింది. ప్యాకెట్‌ను పూర్తిగా తెరచి చూడగా, మరికొన్ని పురుగులు చచ్చిపడివున్నాయి. ఇంతలో ఇరువురూ వాంతులు చేసుకోవడంతో స్పృహ కోల్పోయి.. కింద పడిపోయారు. దీన్ని గమనించి స్థానికులు, బంధువులు.. వెంటనే స్థానిక క్రోంపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై ఆహార భద్రత అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.