శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 7 అక్టోబరు 2021 (15:36 IST)

బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి మేనకా వరుణ్ గాంధీ అవుట్

భారతీయ జనతాపార్టీ నాయకులు మేనకా గాంధీ, వరుణ్ గాంధీ బీజేపీ జాతీయ కార్యవర్గం నుంచి తొలగించారు. బీజేపీ సీనియర్ నాయకురాలు, వరుణ్ తల్లి మేనకా గాంధీ కొడుకుతో పాటు జాతీయ కార్యవర్గం నుంచి తొలగించింది బీజేపీ.
 
వరుణ్ గాంధీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్న నేపధ్యంలోనే ఈమేరకు కీలక నిర్ణయం తీసుకుంది హైకమాండ్. లఖింపూర్ ఖేరీ హింస కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రకటన చేసిన వరుణ్ గాంధీ, ఈమేరకు వస్తున్న వీడియోలను కూడా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పోస్ట్ చేస్తున్నారు.
 
ఈరోజు(7 అక్టోబర్ 2021) కొత్త వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత వరుణ్ గాంధీ ట్వీట్ చేసి.. నిరసన వ్యక్తం చేసినవారిని చంపడం, అమాయక రైతుల రక్తం చిందించడం కరెక్ట్ కాదని అన్నారు. ప్రభుత్వం అహంకారం పక్కనబెట్టి రైతులకు న్యాయం చేయాలని కోరారు.
 
ఈ క్రమంలోనే బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రకటించిన పార్టీ జాతీయ కార్యవర్గాంలో చోటుదక్కలేదు. ప్రధాని నరేంద్ర మోడీ, సీనియర్ నాయకులు ఎల్‌కే అద్వానీ మరియు మురళీ మనోహర్ జోషి సహా మొత్తం 80 మంది నాయకులు ఇందులో సభ్యులుగా ఉన్నారు.