శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: బుధవారం, 15 ఫిబ్రవరి 2017 (17:30 IST)

Mannargudi Mafia is Back... ఎమ్మెల్యేలను వదలం... తమిళనాడు డీజీపికే సవాల్?

అమ్మ సమాధి వద్ద ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లతో భగభగ చూస్తూ సమాధిపై సత్తవకొద్దీ మూడుసార్లు కొట్టిన శశికళ తమిళనాడు వదలి జైలుకైతే వెళుతోంది కానీ ఆమె అనుయాయులు మాత్రం అంగుళం కూడా కదలట్లేదు. తమిళనాడు డీజీపి ఆదేశాల అనుగుణంగా గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ

అమ్మ సమాధి వద్ద ఎర్రని నిప్పు కణికల్లాంటి కళ్లతో భగభగ చూస్తూ సమాధిపై సత్తవకొద్దీ మూడుసార్లు కొట్టిన శశికళ తమిళనాడు వదలి జైలుకైతే వెళుతోంది కానీ ఆమె అనుయాయులు మాత్రం అంగుళం కూడా కదలట్లేదు. తమిళనాడు డీజీపి ఆదేశాల అనుగుణంగా గోల్డెన్ బే రిసార్టు నుంచి ఎమ్మెల్యేలందరూ ఖాళీ చేయాలని పోలీసులు చెపుతున్నప్పటికీ శశికళ వర్గీయులు మాత్రం ఖాతరు చేయడంలేదు. ఇంతకీ శశికళను అంటిపెట్టుకుని వుండే మాఫియా ఎవరయ్యా అని చూస్తే... 1990ల్లో తమిళనాడులో దినదిన ప్రవర్థమానంగా ఎదిగిన శశికళ అండ్ కోకు తమిళనాడులో మన్నార్‌గుడి మాఫియా అనే పేరు పెట్టేశారు. 
 
రియల్ ఎస్టేట్ రంగం నుంచి టెలివిజన్ రంగం వరకూ తమ సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నారు వీరు. శశికళ ప్రస్తుతం బెంగళూరు పరప్పణ అగ్రహారం జైలులో మూడున్నరేళ్లు శిక్షను అనుభవించేందుకు శశికళ వెళ్లిన నేపధ్యంలో తమిళనాడులో మాత్రం ఆమె అనుయాయులు దినకరన్, వెంకటేష్‌తో పాటు మరికొంతమంది కుటుంబ సభ్యులు తమిళనాడులో తమ నేతృత్వంలోని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే తతంగాన్ని నడిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో తమిళనాడు గవర్నర్ ప్రభుత్వ ఏర్పాటుకు పన్నీర్ సెల్వం వర్గానికి ఛాన్స్ ఇస్తారో లేదంటే శశికళ వర్గానికి ఇస్తారోనన్న ఉత్కంఠ నెలకొని వుంది.