మధురలో కొత్త రకం వ్యాధి... 10 మంది మృత్యువాత
కరోనా వైరస్ దెబ్బకు ఇప్పటికే దేశ ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని మధురలో మరో కొత్త వ్యాధి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇప్పటికే చాలా మంది ఈ వైరస్ బారినపడ్డారు. ఈ వ్యాధిని స్క్రబ్ టైఫస్ వ్యాధిగా వైద్యులు గుర్తించారు.
తాజాగా మధుర జిల్లా మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రచన గుప్తా ఈ వ్యాధి పై మాట్లాడుతూ.. ఒక్క కొహు గ్రామంలోనే 26 మంది స్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడ్డారని తెలిపారు. అలాగే పిత్రోత్‌తో ముగ్గురు, రాల్‌లో 14 మంది మరియు జసొడలో 17 మందికి ఈ వ్యాధి సోకిందని వివరించారు.
ఇక ఈ ప్రాంతంలో ఇప్పటికే ఈ వ్యాధి బారిన పడి 10 మంది మరణించగా ఇందులో ఎనిమిది మంది చిన్నారులు ఉన్నట్లుగా పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి.