సెల్లూర్ రాజానా మజాకా..? ప్లస్ టూలో 1225/1200 మార్కులు-పేలుతున్న మీమ్స్.. ఇంతకీ ఆ రాజా ఎవరు?
తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్లస్ టూ ఫలితాలను శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై సోషల్ మీడియాలో ఓ మీమ్స్ వైరల్‌గా మారింది. ఇటీవల తమిళనాడు కో-ఆపరేటివ్స్ మంత్రి సెల్లూర్ రాజు వైగై డ్యామ్ నీ
తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాలకు చెందిన ప్లస్ టూ ఫలితాలను శుక్రవారం విడుదలయ్యాయి. ఈ ఫలితాలపై సోషల్ మీడియాలో ఓ మీమ్స్ వైరల్‌గా మారింది. ఇటీవల తమిళనాడు కో-ఆపరేటివ్స్ మంత్రి సెల్లూర్ రాజు వైగై డ్యామ్ నీరు ఆవిరి కాకుండా, నీటిని వృధా చేయకుండా నిరోధించేందుకు ''థెర్మాకోల్'' అనే కొత్త పథకాన్ని ప్రారంభించారు. అయితే ఈ పథకానికి పెద్దగా ఆదరణ లభించలేదు. అంతేగాకుండా ఆ పథకంపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి.
ఇంకా సెల్లూర్ రాజా పథకంపై సోషల్ మీడియాలో మీమ్స్ పేలాయి. ప్రస్తుతం సెల్లూర్ రాజా అంటేనే థెర్మాకోల్ అనే పథకం అని నెటిజన్లకు బాగా గుర్తుకొచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో సెల్లూర్ రాజాకు శుక్రవారం విడుదలైన పరీక్షా ఫలితాలకు లింకు పెట్టేశారు.. నెటిజన్లు. ఆయన ప్లస్ టూలో 1200 మార్కులకు 1225 మార్కులు సంపాదించాడని సెటైర్లు వేశారు. సాధారణంగా ప్లస్ టూ విద్యార్థులు 1200 మార్కులకే పరీక్ష రాస్తారు.
కానీ ఈ మార్కుల కంటే అదనంగా 25 మార్కులు సెల్లూర్ రాజా సంపాదించారని ఫేస్ బుక్‌లో మీమ్స్ రిలీజ్ చేశారు. అంతటితో ఆగకుండా సబ్జెక్టుల పరంగా మార్కుల వివరాలను కూడా మీమ్స్‌లో జతచేశారు. తమిళం- 201, ఆంగ్లం-200, ఫిజిక్స్ -201, కెమిస్ట్రీ - 250, బయాలజీ - 164, మాథ్స్- 209.. మొత్తం 1225 మార్కులంటూ సెటైర్లు పేల్చారు. ఈ మీమ్స్ నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంకా ఈ మీమ్స్‌కు లైకులు, షేర్స్ వెల్లువెత్తుతున్నాయి.