1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 29 ఆగస్టు 2016 (09:45 IST)

ఢిల్లీలో మైనర్ బాలికపై సహ విద్యార్థుల సామూహిక అత్యాచారం.. వీడియోలతో బ్లాక్‌మెయిల్..

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న

దేశ రాజధాని నగరం న్యూఢిల్లీలో మహిళలపై దారుణాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్నారులపై కూడా కామాంధులు విరుచుకుపడుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది. పాఠశాలలో చదువుకుంటున్న ఓ మైనర్ బాలికపై తరగతి గదిలోని సహ విద్యార్థులే సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఢిల్లీలో సంచలనం సృష్టించింది. 
 
తన మైనర్ కూతురిపై సహాధ్యాయులైన 15 మంది విద్యార్థులు సామూహిక అత్యాచారం జరిపారని బాలిక తల్లి జామియానగర్ పోలీసు స్టేషనులో ఫిర్యాదు చేశారు. దీనిపై తాము దర్యాప్తు చేసి బాట్లా ప్రాంతానికి చెందిన ఇద్దరు బాలురను పట్టుకున్నామని పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
ఈ కేసులో సమగ్ర దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వివరించారు. మైనర్ బాలికపై అనేకమార్లు తోటి విద్యార్థులు అత్యాచారానికి పాల్పడ్డారని.. ఆ దృశ్యాలను ఫోన్లలో చిత్రీకరించి బ్లాక్ మెయిల్ చేసేవారని పోలీసులు వెల్లడించారు.