జమ్మూకాశ్మీర్‌లో భారత్‌లో అంతర్భాగం కాదు.. దేహాన్ని ముక్కలు చేసినా నా వైఖరి ఇదే : జేకే ఎమ్మెల్యే
జమ్మూకాశ్మీర్ రాష్ట్ర అసెంబ్లీలో స్వతంత్ర ఎమ్మెల్యేగా ఉన్న షేక్ రషీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత రాజ్యాంగంపై ప్రమాణం చేసి.. ఎమ్మెల్యే పదవి చేపట్టిన ఈయన.. జమ్మూకాశ్మీర్ మాత్రం భారత్‌లో అంతర్భాగం కాదని వాదిస్తున్నారు. పైగా.. ఆయనను ఉరితీసినా ఈ వైఖరిని మార్చుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... 'జమ్మూకశ్మీర్ భారతదేశంలో అంతర్భాగం కాదు. అక్కడ ప్రజాభిప్రాయ సేకరణ(ప్లెబిసైట్) నిర్వహించాలి. జైలుకు పంపినా, చివరకు నన్ను ఉరితీసినా నా వైఖరి మారదు. జమ్మూకశ్మీర్ ఇటు భారత అంతర్భాగం కాదు.. పాకిస్థాన్ భూభాగమూ కాదు. చారిత్రక వాస్తవాన్ని ప్రతి ఒక్కరూ అంగీకరించాలి. గుర్తించాలి కూడా.
రాష్ట్ర ప్రజలు ఎన్నికల్లో పెద్దసంఖ్యలో ఓట్లేశారని భారత వాదిస్తోంది. అలాంటప్పుడు ప్లెబిసైట్ నిర్వహించకుండా ఎందుకు పారిపోతోంది? అని ఆయన ప్రశ్నించారు. పైగా, ప్లెబిసైట్ నిర్వహిస్తే కాశ్మీర్ ప్రజలంతా భారత్‌కు అనుకూలంగా ఓటేస్తే అపుడు ఖచ్చితంగా భారత్‌లో అంతర్భాగమవుతుందని అంగీకరిస్తానని చెప్పారు.