శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : బుధవారం, 21 జూన్ 2017 (18:58 IST)

నేను తాకడం నీకు ఇష్టం లేదా...? సీటు పక్కనే నొక్కుతూ...

కామాంధులు రోడ్ల మీదే కాదు బస్సుల్లో రైళ్లలో తిరుగుతుంటారని అనుకుంటారు కానీ ఇప్పుడు విమానాల్లోనూ కామ చేష్టలు చేస్తున్నారు. విమానంలో ఓ కామాంధుడు చేసిన చేష్టలతో ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లో

కామాంధులు రోడ్ల మీదే కాదు బస్సుల్లో రైళ్లలో తిరుగుతుంటారని అనుకుంటారు కానీ ఇప్పుడు విమానాల్లోనూ కామ చేష్టలు చేస్తున్నారు. విమానంలో ఓ కామాంధుడు ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించాడు. వివరాల్లోకి వెళితే... ఢిల్లీ-ముంబై విమానంలో గురుగావ్‌కు చెందిన మోహిత్ కన్వర్ తన పక్క సీట్లో కూర్చున్న మహిళపై చేతులు వేయడం మొదలుపెట్టాడు. అంతేకాకుండా తన ఇష్టానుసారం అసభ్యకరంగా ప్రవర్తిస్తూ తాకడం చేశాడు. 
 
అతడి ప్రవర్తనతో బాధితురాలు ఎయిర్‌హోస్టెస్‌కు ఫిర్యాదు చేయగా ఆమె బాధితురాలి సీటును మరోచోటకు మార్చింది. అలా ఆమె సీటు మారుతూ వెళుతుంటే, అప్పుడు మళ్లీ ఆమెను తాకుతూ.... నేను తాకడం నీకు ఇష్టం లేదా అంటూ ప్రశ్నించాడు. విమానం దిగిన తర్వాత బాధితురాలు ఫిర్యాదు చేయగా అతడిని అరెస్టు చేశారు.