సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (13:07 IST)

మన్మోహన్ రెయిన్ కోట్ స్నానం.. బాత్రూమ్‌లోకి తొంగిచూడటం మోడీ అలవాటే: రాహుల్ ఎద్దేవా

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇతరుల బాత్రూమ్‌లోకి తొంగిచూ

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ రెయిన్ కోటు వేసుకుని బాత్రూంలో స్నానం చేస్తారంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇతరుల బాత్రూమ్‌లోకి తొంగిచూడటం మోడీ అలవాటని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. మోడీకి ఇక మిగిలింది రెండున్నరేళ్లేనని.. గడచిన రెండున్నర ఏళ్లలో మోదీ దారుణంగా విఫలమయ్యారని రాహుల్ దుయ్యబట్టారు. 
 
మోడీని ఎవరైనా ఆయనను ప్రశ్నించినప్పుడు, సమాధానాలు చెప్పలేక ఎదురు దాడికి దిగుతారని రాహుల్ వ్యాఖ్యానించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో 99 శాతం సీట్లను గెలుచుకోవడానికే కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు పొత్తు పెట్టుకున్నాయని చెప్పారు. కొంతమంది మన్ కీ బాత్ చెబుతారు కాని, కామ్ కీ బాత్ చెప్పరని ఎద్దేవా చేశారు. 
 
ఇదిలా ఉంటే.. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌పై ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ శుక్రవారం విమర్శలు గుప్పించారు. 'గూగుల్‌లో రాహుల్‌ పేరు మీద సెర్చ్‌ చేస్తే, అతడి పేరు మీద ఉన్నన్న జోకులు ఎవరిమీదా ఉండవు' అంటూ ఎద్దేవా చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని బిజ్‌నూర్‌లో ప్రధాని మోడీ ఎన్నికల సభలో శుక్రవారం ప్రసంగించారు. ఇంటర్నెట్‌ గూగుల్‌లో రాహుల్‌ పేరుతో సెర్చ్‌ చేస్తే... బోలడన్ని జోకులు వస్తాయన్నారు.
 
యూపీ సీఎం అఖిలేశ్‌ యాదవ్‌పైన కూడా మోడీ తీవ్ర విమర్శలు చేశారు. కాంగ్రెస్‌తో సమాజ్‌వాదీ పొత్తు పెట్టుకోవడాన్ని ప్రధాని తప్పుపట్టారు. గూగుల్‌లో ఆ జోకుల వెంట రాహుల్‌తో పాటు అఖిలేశ్‌ కూడా వస్తున్నాడని విమర్శించారు.