శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 7 ఆగస్టు 2021 (11:13 IST)

3 రోజులు మోడీ మంత్రి వర్గ సమావేశం..ఎందుకో తెలుసా?

నూతనంగా పదవీ బాధ్యతలు స్వీకరించిన ప్రధాని మోడీ నేతృత్వంలోని కేబినేట్‌ వర్గం మూడు రోజుల పాటు సమావేశాన్ని నిర్వహించనుంది. మంగళవారం నుండి మూడు రోజుల పాటు ఈ సమావేశాలు సాగనున్నాయి.

మిగిలిన మూడు సంవత్సరాల పదవీకాలానికి సంబంధించి ఎజెండాను రూపొందించడానికి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కేంద్రంపై ప్రజల కనబరుస్తున్న ఆగ్రహాన్ని తగ్గించేందుకు అవసరమైన ప్రణాళికల గురించి కూడా చర్చిస్తారని సమాచారం.

2014లో మోడీ ప్రధాని తొలిసారిగా పదవి చేపట్టిన నాటి నుండి చూస్తే... ఇటీవల కాలంలో తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేక ఆందోళనలు, కోవిడ్‌ మహమ్మారి వైఫల్యం, జీవన వ్యయం వంటి సమస్యలపై విమర్శలను ఎదుర్కోవడానికి కష్టపడుతోంది.

గత నెలలో, విమర్శల ప్రతిదాడిని ఎదుర్కొనేందుకు.. కేంద్ర మంత్రి వర్గ విస్తరణ పేరుతో పలువురు కేంద్ర మంత్రులను తొలగించి... కొత్త వారికి పదవులు అప్పగించింది. రాబోయే పలు అసెంబ్లీ, సార్వత్రిక ఎన్నికల్లో దృష్టిలో ఉంచుకుని కొత్త ముఖాలకు అవకాశం ఇచ్చింది.

ఇటీవల కొత్త బాధ్యతలు చేపట్టిన మంత్రి వర్గంతో మంగళవారం నుండి ఈ సమావేశం నిర్వహించనున్నట్లు బిజెపి వర్గాలు చెబుతున్నాయి. గత నెలలో మంత్రిత్వ శాఖ పనితీరును సమీక్షించి... నిర్ధేశిత లక్ష్యాలను చర్చిస్తారని తెలుస్తోంది.