గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 23 డిశెంబరు 2023 (19:23 IST)

వివాహమైన 13 రోజులకే భార్యపై దాడి.. మోటివేషనల్ స్పీకర్‌పై దాడి

yanika
వివాహమైన 13 రోజులకే కట్టుకున్న భార్యపై భర్త అతిక్రూరంగా దాడి చేశాడు. ఈ దాడికి పాల్పడింది ఓ నిరక్ష్యరాస్యుడో కాదు. ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ వివేక్ బింద్రా కావడం గమనార్హం. దీంతో నోయిడా పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. నోయిడాలోని సెక్టార్ 94లో సూపర్ నోవా వెస్ట్ రెసిడెన్సీలో వివేక్ బింద్రా, భార్య యూనికాలు కలిసివుంటున్నారు. వీరిద్దరికీ డిసెంబరు ఆరో తేదీన వివాహమైంది. డిసెంబరు 7వ తేదీన బిద్రా ఆయన తల్లికి మధ్య గొడవ జరిగింది. ఆ వివాదంలో బిద్రా భార్య యూనికా కలుగజేసుకోవడంతో ఈ గొడవ మరింత పెద్దదైంది. దీంతో నిగ్రహం కోల్పోయిన బింద్రా.. తన భార్యపై విచక్షణా రహితంగా దాడి చేశాడు. 
 
ఈ దాడిలో యానికా గాయపడ్డారు. ఆమె ముఖంతో పాటు శరీరంపై గాయాలు కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం యానికా ఆస్పత్రి పడకపై గాయాలతో ఉన్న వీడియో కనిపించింది. యానికాను బింద్రా గదిలోకి తీసుకెళ్ళి అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు జట్టు లాగి ఆమెపై దాడికి పాల్పడినట్టు పోలీసులు తెలుస్తుంది.