శుక్రవారం, 3 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 13 సెప్టెంబరు 2022 (15:12 IST)

మధ్యప్రదేశ్‌ : భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్విక్‌ పెట్టిన డ్రగ్ అడిక్ట్ భర్త

woman
మహిళలపై అత్యాచారాలు, అకృత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో భార్య పట్ల భర్త దారుణంగా ప్రవర్తించాడు. భార్య ప్రైవేట్ పార్ట్‌లో ఫెవిక్‌విక్‌ని పెట్టాడు. మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లోని కొత్వాలీ పోలీస్‌స్టేషన్‌లో ఒక అవమానకరమైన సంఘటన తెరపైకి వచ్చింది. అంతేగాకుండా భార్య చేతులు, కాళ్ళను ముందుకు కట్టి క్రూరుడిగా మారాడు. 
 
అంతే కాదు భార్య ప్రైవేట్ పార్ట్‌లో స్టిక్కీ పదార్థమైన ఫెవిక్విక్‌ను భర్త పెట్టాడు. దీంతో భార్య కేకలు వేయడం ప్రారంభించింది. బాధితురాలిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రిలో చేర్పించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. 
 
విచారణలో డ్రగ్స్‌కు బానిసైన ఆ వ్యక్తి మత్తులో ఉండేందుకు గాను భార్య వద్ద తరచూ డబ్బులు అడిగేవాడని తేలింది. ఆమె డబ్బుల్లేవని చెప్పడంతో ఈ అకృత్యానికి పాల్పడ్డాడని పోలీసులు చెప్తున్నారు.