మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వి
Last Modified: శనివారం, 7 నవంబరు 2020 (16:34 IST)

అసాం కామాఖ్యదేవీ ఆలయానికి ముఖేష్ అంబానీ దంపతులు 19 కిలోల బంగారం భారీ విరాళం

అసాం లోని కామాఖ్యదేవి ఆలయం దేశవ్యాప్తంగా ప్రసిద్ది చెందింది. తాజాగా ఈ ఆలయానికి ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ప్రముఖ రిలయన్స్ అధినేత, పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ దంపతులు భారీగా బంగారం విరాళంగా ఇచ్చారు. ఆలయగోపుర కలశాల తయారీ కోసం 19 కిలోల బంగారాన్ని ఇచ్చారు. ఈ బంగారంతో మూడు గోపుర కలశాలు రూపొందిస్తున్నట్లు కామాఖ్య ఆలయ వర్గాలు తెలిపాయి.
 
ఈ నేపథ్యంలో మూడు నెలల క్రితమే బంగారం విరాళంగా ఇచ్చేందుకు అంబానీ దంపతులు కామాఖ్య ఆలయ వర్గాలకు సమాచారం అందించారు. అవే కాకుండా మూడు కలశాల బంగారు తాపడం ఖర్చులు కూడా తేమే భరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ తరపున బంగారం అందించగా కలశాల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
 
ఈ నిర్మాణ కార్యక్రమంలో శిల్పులతో పాటు రిలయన్స్ ఇంజినీర్లు కూడా పాలుపంచుకున్నారు. ఈ కలశాలు పూర్తయిన తర్వాత ముఖేష్ అంబానీ వారి భార్య నీతా అంబానీ అస్సాంలో కామాఖ్య అమ్మవారి ఆలయాన్ని సందర్శనించనున్నా రు. దేశంలో గల శక్తి పీఠాల్లో ఒకటిగా గుర్తింపు పొందిన కామాఖ్య ఆలయం అస్సాంలోని నీలాచల కొండల్లో కొలువై ఉంది. ఇక్కడికి దేశవిదేశాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.