త్వరలో దేశవ్యాప్తంగా జియో 5జి సేవలు: రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ టిఎమ్ ఫోరమ్ యొక్క డిజిటల్ ట్రాన్స్పర్మేషన్ వరల్డ్ సీరీస్ 2020 వర్చువల్ కాన్పరెన్స్‌లో ప్రసంగించారు. ఈ సందర్భంగా భారతీయులకు అల్ట్రా హైస్పీడ్ కనెక్టివిటీ, సరసమైన స్మార్ట్ పరికరాలు మరియు ట్రాన్స్పర్మేషన్ డిజిటల్ యాక్సెస్‌కు జియో ఎలా సహాయపడుతుందో వివరించారు.
త్వరలో తమ సంస్థ భారత్ అంతటా 5జి సేవలను ప్రారంభించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు. మొబైల్ డేటా వినియోగంలో ప్రపంచంలో 155వ స్థానంలో ఉన్న భారత్ 2016లో టెలికాం పరిశ్రమలో జియో అడుగు పెట్టిన తర్వాత అగ్రస్థానానికి వచ్చిందని తెలిపారు. 2జి నిర్మాణానికి టెలికాం కంపెనీలకు 25 ఏళ్లు పడితే 4జి నిర్మాణానికి జియోకు కేవలం 3ఏళ్లు మాత్రమే పట్టిందని తెలిపారు ముఖేష్.
ప్రపంచంలోనే అతి తక్కువ డేటా టారిప్స్‌ను రిలయన్స్ ప్రారంభించిందన్న ముఖేష్, జియో ప్రారంభించిన 170 రోజుల్లో 100 మిలియన్ల కస్టమర్స్‌ను ఆకర్షించిందని తెలిపారు. అంతేకాకుండా జియో రావడంతో భారతదేశం యొక్క నెలసరి వినియోగం 0.2 మిలియన్ జిబి నుండి 1.2 బిలియన్ జిబికి పెరిగిందన్నారు.
ఇది 600 శాతం వృద్ధి అని ముఖేష్ తెలిపారు. కనెక్టివిటీని మరింత విస్తరించడానికి జియో సంస్థ త్వరలో 50 మిలియన్లకు పైగా గృహాలు మరియు ప్రాంగణాలకు హైస్పీడ్ ఆప్టికల్ పైబర్ నెట్వర్క్‌ను ఏర్పాటు చేస్తోందని తెలిపారు. అదే సమయయంలో భారతదేశమంతటా 5జి సేవలను ప్రారంభించడానికి తమ సంస్థ వేగంగా సన్నాహాలు చేస్తోందని ముఖేష్ తెలిపారు.