శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్

సవతి తల్లిపై బుల్లితెర నటుడు బలాత్కారం.. ఎక్కడ?

ముంబైలో దారుణం జరిగింది. సవతి తల్లిపై ఓ నటుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమె ఇంట్లోని బంగారు నగలు, నగదు ఎత్తుకెళ్లాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
ముంబైకి చెందిన 40 యేళ్ల వ్యక్తి టీవీ సీరియల్స్‌లో నటుడిగా రాణిస్తున్నాడు. అతడి తండ్రి పలు టీవీ సీరియళ్లకు దర్శకత్వం వహిస్తున్నాడు. పైగా, ఈయనకు ముగ్గురు భార్యలు ఉన్నారు. ఇందులో ఒక భార్య అంధేరీలోని లోఖండ్‌వాలాలో నివసిస్తోంది. 
 
ఈ క్రమంలో సవతి తల్లిపై కన్నేసిన నటుడు వరుసకు తల్లి అవుతుందన్న ఇంగితం మరిచి ఆమె ఒంటరిగా ఉన్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు తీసుకుని పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు.