గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 19 ఫిబ్రవరి 2020 (17:43 IST)

బండిని కాస్త జరపవయ్యా అన్నాడు.. జొమాటో డెలివరీ బాయ్‌ మృతి.. ఎలా?

జొమాటో డెలివరీ బాయ్‌ ప్రాణాలు కోల్పోయాడు. హోటల్‌ ముందు పళ్లబండి వ్యక్తితో గొడవ జొమాటో డెలివరీ బాయ్ ప్రాణాలు తీసింది. దారికి అడ్డంగా వున్న పళ్ల బండిని జరపమన్నందుకు పళ్ల బండి నిర్వాహకుడు ఆగ్రహించి.. జొమాటో డెలివరీ బాయ్‌ను కత్తితో ఇష్టమొచ్చినట్టు పొడిచాడు. ముంబైలోని పోవై సబర్బన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. 
 
వివరాల్లోకి వెళితే.. ముంబైకి చెందిన భాస్కర్ జొమాటోలో డెలివరీ బాయ్‌గా పనిచేస్తున్నాడు. తనకు వచ్చిన ఆర్డర్లను తీసుకోవడానికి పోవై ప్రాంతంలో వున్న హోటల్‌కు తరచూ వచ్చేవాడు. ఆ హోటల్ ముందు రోడ్డుపై సచిన్ దినేష్ సింగ్ అనే వ్యక్తి పళ్ల బండి పెట్టేవాడు. భాస్కర్ పలుమార్లు ఆ హోటల్‌కు వచ్చినప్పుడు అడ్డంగా ఉన్న పళ్లబండిని జరపాలని కోరడంతో ఇద్దరి మధ్యా చిన్నగా గొడవలు జరిగాయి. 
 
ఈ వివాదం కాస్త ముదిరింది. దీంతో దినేష్ సింగ్, అతడి స్నేహితుడు హరిరామ్ కలిసి భాస్కర్‌పై దాడి చేశారు. కత్తి తీసుకుని ఇష్టమొచ్చినట్టుగా పొడిచారు. ఛాతీలో, కడుపులో కత్తిపోట్లు దిగడంతో భాస్కర్ ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఇక పరారిలో వున్న దినేష్, హరిరామ్‌లను పోలీసులు అరెస్ట్ చేశారు.