బుధవారం, 12 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 7 జనవరి 2017 (11:03 IST)

శశికళకు కష్టాలే: అన్నాడీఎంకేను కైవసం చేసుకోవాలో? కొత్త పార్టీ పెట్టాలో? ఇంకా నిర్ణయం తీసుకోలేదు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళకు మద్దతు తగ్గిపోతోంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి నెచ్చెలి శశికళ నటరాజ్‌ను తాము బహిష్కరించామని, ఆమెతో మాకు ఎటువంటి సంబంధాలు లేవని ఆపార్టీ ద్వితీయ,

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన శశికళకు మద్దతు తగ్గిపోతోంది. అన్నాడీఎంకే పార్టీ నుంచి నెచ్చెలి శశికళ నటరాజ్‌ను తాము బహిష్కరించామని, ఆమెతో మాకు ఎటువంటి సంబంధాలు లేవని ఆపార్టీ ద్వితీయ, తృతీయ స్థాయి నాయకులు, కార్యకర్తలు అంటున్నారు. శశికళ ఎప్పటికి తమిళనాడుకు చిన్నమ్మ కాలేరని తేల్చి చెప్తున్నారు.
 
మరోవైపు మాజీ సీఎం జయలలిత మేనకోడలు దీపా జయకుమార్‌కు మద్దతు పెరిగిపోతోంది. జయలలిత సోదరుడు జయకుమార్‌ కుమార్తె దీప టి.నగర్‌లోని శివజ్ఞానం వీధిలో నివసిస్తున్నారు. జయలలిత మృతి అనంతరం దీప రాజకీయాల్లోకి రావాలని అన్నాడీఎంకేను వ్యతిరేకిస్తున్న కార్యకర్తలు కొద్దిరోజులుగా దీపను కలుసుకొని ఒత్తిడి చేస్తున్నారు. జయలలిత వారసురాలు ఆమేనని, జయలలిత చేపట్టిన పథకాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలను స్వయంగా ముందుకు తీసుకెళ్లాలని దీపను కోరుతున్నారు. 
 
ఇదే కోవలో శుక్రవారం కూడా వందలాది మంది కార్యకర్తలు దీపా ఇంటికి తరలివచ్చారు. ఈ సందర్బంగా ఆమె తన భర్త మాధవన్‌తోపాటు కార్యకర్తలను కలసి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా దీప మీడియాతో మాట్లాడుతూ, మేనత్త జయలలిత మరణం అనంతరం అన్నాడీఎంకేను కైవసం చేసుకోవాలా, కొత్త పార్టీ పెట్టాలా అన్న దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. 
 
ప్రస్తుతం కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నానని, ఒకవేళ రాజకీయాల్లోకి రావాలనుకుంటే తనను ఎవ్వరూ ఆపలేరన్నారు. కాగా, దీప భర్త మాధవన్ మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి జయలలిత వారసత్వం నిలిపే భాద్యత దీపదేనని, ఆమెకు తనతో పాటు వేలాదిమంది కార్యకర్తలు తోడుంటారన్నారు.
 
తమిళనాడులోని మధురై, ఈరోడ్డు, తిరుచ్చి, తేనీ, తిరుప్పూరు, కోవై, తిరువణ్ణామలై, తంజావూరు, విల్లుపురం తదితర జిల్లాల నుంచి అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చెన్నైలోని టీ నగర్‌లోని జయమ్మ మేనకోడలు దీపా జయకుమార్ ఇంటికి చేరుకున్నారు. 
 
ఈ సందర్బంగా అన్నాడీఎంకే కార్యకర్తలను ఉద్దేశించి దీపా మాట్లాడారు. మీరు శాంతియుతంగా ఉండాలని, అన్ని త్వరలో సర్దుకుంటాయని నచ్చచెప్పారు. శశికళ అడుగులకు మడుగులు తొక్కుతున్న ఎంపీలు, ఎమ్మెల్యేలకు తాము త్వరలోనే బుద్ధిచెప్తానని, నియోజక వర్గాల్లో అడుగు పెట్టనివ్వకుండా చూస్తామని కార్యకర్తలు హెచ్చరించారు.