ప్రధాని మోడీ నిలబెట్టిన బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వడం లేదు : రజినీకాంత్
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వడం లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ స్థానాని
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంపిక చేసి నిలబెట్టిన అభ్యర్థికి తాను మద్దతు ఇవ్వడం లేదని సూపర్ స్టార్ రజినీకాంత్ స్పష్టంచేశారు. ముఖ్యమంత్రి జయలలిత మరణంతో ఆమె ప్రాతినిథ్యం వహిస్తూ వచ్చిన ఆర్కే.నగర్ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజా సోదరుడు, మ్యూజిక్ డైరెక్టర్ గంగై అమరన్ పోటీ చేస్తున్నారు. ఈయన ఇటీవల రజినీకాంత్‌ను కలిశారు. దీంతో ఆర్కేనగర్ ఉప ఎన్నికల్లో గంగై అమరన్‌కు రజినీకాంత్ మద్దతు ఇస్తున్నట్టుగా వార్తలు గుప్పుమన్నాయి.
వీటిపై రజినీకాంత్ గురువారం ట్విట్టర్‌లో స్పందించారు. ఆర్కేనగర్‌లో బీజేపీ అభ్యర్థికి తాను మద్దతు ఇస్తున్నట్టు వచ్చిన వార్తల్లో ఏమాత్రం నిజంలేదన్నారు. ఈ ఎన్నికల్లో తాను ఏ ఒక్కరికీ మద్దతు ఇవ్వడం లేదని తన ట్విట్టర్ ఖాతాలో స్పష్టం చేశారు.