శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 4 సెప్టెంబరు 2016 (11:48 IST)

జయహో మోడీ... 2019లో ప్రధానిగా నమోనే... 70 శాతం మంది భారతీయుల ఓటు

దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా

దేశ ప్రజలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాటు ఆయన పాలన పట్ల ప్రజలు మంచి అభిప్రాయంతోనే ఉన్నారు. వచ్చేదఫా (2019)లో కూడా ఆయనే ప్రధానమంత్రిగా కొనసాగాలని కోరుకుంటున్నారు. ఇలా కోరుకుంటున్న వారి సంఖ్య 70 శాతంగా ఉంది. 
 
'2019లో భారతదేశ ప్రధాని' అనే అంశంపై యూత్ ఆఫ్ ద నేషన్ పేరుతో నిర్వహించిన ఆన్‌లైన్ సర్వేలో మెజారిటీ ప్రజలు తిరిగి మోడీనే పీఎం కావాలని కోరుకున్నారు. న్యూస్ యాప్ ఇన్‌షార్ట్స్, మార్కెటింగ్ ఏజెన్సీ ఇప్సాస్ సంయుక్తంగా ఈ ఆన్‌లైన్ సర్వేను నిర్వహించాయి. 
 
2019లో మోడీనే ప్రధానిగా చూడాలనుకుంటున్నట్టు 70 శాతం మంది ప్రజలు కోరుకున్నారు. తాము తిరిగి ఆయననే ప్రధానిగా ఎన్నుకుంటామని  వారంతా స్పష్టం చేశారు. అలాగే 64 శాతం మంది మహిళలు కూడా మోడీకి మద్దతు పలికారు. ఈ సర్వేలో మొత్తం 63,141 మంది పాల్గొన్నారు. 70 శాతం మంది మోదీకి జైకొట్టగా 17 శాతం ‘నో’ అన్నారు. 13 శాతం తాము ఇంకా ఏ విషయం తేల్చుకోలేదని సమాధానమిచ్చారు.