శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (13:59 IST)

రిజర్వేషన్ల తొలగింపునకు మోడీ వ్యూహం : రాహుల్

ప్రస్తుతం దేశంలో అమల్లో ఉన్న రిజర్వేషను సమూలంగా ఎత్తివేయాలన్న ఆలోచనలో ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, దేశంలో అణగారిన వర్గాలకు, మైనారిటీలకు రిజర్వేషన్లు తొలగించే దిశగా ప్రధాని మోడీ అడుగులు వేసున్నారని ఆరోపించారు. 
 
ఆయన సోమవారం మీడియాతో మాట్లాడుతూ, ప్రధాని నరేంద్ర మోడీ దేశంలో అమలవుతున్న రిజర్వేషన్లకు పూర్తి వ్యతిరేకమన్నారు. సమీప భవిష్యత్తులో రిజర్వేషన్లను పూర్తిగా తొలగించేందుకు బీజేపీ ప్రయత్నం చేయనుందని, తాము దాన్ని అడ్డుకుని తీరుతామన్నారు. 
 
కాగా, ఎస్సీ, ఎస్టీలకు నియామకాలు, ప్రమోషన్లలో రిజర్వేషన్ల అమలు రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యతేనని, దానిపై తామేమీ కొత్త ఆదేశాలు జారీ చేయబోమని సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. 
 
మరోవైపు, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రధాని నరేంద్ర మోడీ సారథ్యంలోని బీజేపీ సర్కారు నాశనం చేస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీ సోమవారం రాజ్యసభలో ఆందోళనకు దిగింది. మోడీ సర్కారు వాస్తవాలను దాస్తోందని, ప్రజల చేతిలో డబ్బులు లేవని ఆ పార్టీకి చెందిన సభ్యులు ఆందోళనకు దిగారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం నెలకొంది.