ఈశాన్య రాష్ట్రాల్లోనే ఎన్నార్సీ... ఆందోళనలు వద్దు.. కేంద్రం
కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక ప్రకటన చేసింది. దేశ వ్యాప్తంగా ఎన్నార్సీకి వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. గత రెండు రోజులుగా పార్లమెంట్‌లో సైతం విపక్ష పార్టీలు రభస చేస్తున్నాయి. ఈ జాతీయ పౌర జాబితా (ఎన్.ఆర్.సి) రద్దు చేయాలని విపక్ష పార్టీలన్నీ ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. అలాగే, దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఈనేపథ్యంలో ఎన్నార్సీ అమలుపై కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో అత్యంత కీలక ప్రకటన చేసింది. ఎన్నార్సీ అమలుపై ఇప్పటివరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర హోంశాఖ కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు లోక్‌సభ లిఖిత పూర్వకంగా దీనిపై సమాధానం ఇచ్చింది.
ఇప్పటికైనా ఎన్నార్సీపై చేస్తున్న ఆందోళనలు విరమించుకోవాలని విజ్ఞప్తి చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రమే ఎన్నార్సీని అమలు చేస్తున్నామని, మిగతా రాష్ట్రాల్లో దీని అమలుకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని హోంశాఖ ఆ ప్రకటనలో పేర్కొంది.