శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 ఫిబ్రవరి 2020 (11:19 IST)

ఎన్నార్సీ ఓకేగానీ.. మహారాష్ట్రలో మాత్రం అమలు చేయం : ఉద్ధవ్ ఠాక్రే

జాతీయ పౌరసత్వ సవరణ చట్టంపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే యుటర్న్ తీసుకున్నారు. జాతీయ స్థాయిలో ఈ చట్టానికి మద్దతు తెలుపుతున్న ఆయన.. రాష్ట్రంలో మాత్రం అమలు చేయబోమని కుండబద్ధలుకొట్టినట్టు చెప్పారు. 
 
నిజానికి కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టినపుడు లోక్‌సభలో శివసేన పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. కానీ, రాజ్యసభ విషయానికి వచ్చేసరికి శివసేన మెలిక పెట్టింది. తాము పౌరసత్వ సవరణ బిల్లుకు ఎంతమాత్రమూ వ్యతిరేకం కాదని, అయితే మిగితా రెండు విషయాలైన ఎన్పీఆర్, ఎన్నార్సీ మాత్రం తాము వ్యతిరేకిస్తామని స్పష్టంచేశారు.
 
'పౌరసత్వ సవరణ చట్టం అనేది దేశం నుంచి ఏ ఒక్కరినీ తరిమేసే చట్టం ఎంతమాత్రం కాదు. అయితే మహారాష్ట్రలో ఎన్నార్సీని మాత్రం మేము వ్యతిరేకిస్తాం. ఎందుకంటే హిందువులు కూడా తమ పౌరసత్వాన్ని నిరూపించుకోవడం కష్టమే' అని ఆయన చెప్పుకొచ్చారు. 
 
అసోం ఎన్నార్సీ జాబితాలో కూడా చాలా మంది హిందువుల పేర్లు గల్లంతయ్యాయని, ముస్లింలకే కాదు, హిందువులకు కూడా తమ పౌరసత్వం నిరూపించుకోవడం కష్టమేనని ఉద్ధవ్ ఠాక్రే అభిప్రాయపడుతున్నారు. అందువల్ల ఈ చట్టాన్ని తమ రాష్ట్రంలో అమలు చేయబోమని స్పష్టంచేశారు. 
 
కాగా, ఈ ఎన్నార్సీ చట్టాని ఇప్పటికే పలు రాష్ట్రాలు అమలు చేయబోమని తేటతెల్లం చేసిన విషయం తెల్సిందే. ఈ జాబితాలో తాజా ఎన్సార్సీని వ్యతిరేకిస్తున్న జాబితాలో మహారాష్ట్రలో కూడా చేరింది. బీజేపీ పాలిత రాష్ట్రాలు మినహా మిగిలిన రాష్ట్రాలు తీవ్రంగా విషయం తెల్సిందే.