శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 19 డిశెంబరు 2016 (14:44 IST)

ప్రాణాలు పోయినా సరే.. అవినీతి నిర్మూలనే ప్రధాన లక్ష్యం: ప్రధాని నరేంద్ర మోడీ

ప్రాణాలు పోయినా సరే.. తాను చేపట్టిన యజ్ఞం నుంచి వెనుకంజ వేసే ప్రసక్తే లేదనీ, దేశంలో అవినీతి నిర్మూలనే తన ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 'భారత నైపుణ

ప్రాణాలు పోయినా సరే.. తాను చేపట్టిన యజ్ఞం నుంచి వెనుకంజ వేసే ప్రసక్తే లేదనీ, దేశంలో అవినీతి నిర్మూలనే తన ప్రధాన లక్ష్యమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్‌లో 'భారత నైపుణ్య సంస్థ'కు ఆయన సోమవారం శంకుస్థాపన చేశారు. నైపుణ్యాభివృద్ధికి పెద్దపీట వేయడంతో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేస్తోంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన బహిరంగ సభలో ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగించారు.
 
నల్లధనం నుంచి దేశానికి విముక్తి కల్పించేందుకు తమ ప్రభుత్వం పోరాటం చేస్తోందని, ఇందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం అనే సంక్షేమ కార్యక్రమాలు చేపట్టిందన్నారు. దేశంలో అవినీతిని నిర్మూలించడమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అవినీతిపరుల ఆటకట్టించేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటుంటే... విపక్షాలు వారికి వత్తాసు పలుకుతున్నాయని ప్రధాని ఆరోపించారు. ముఖ్యంగా.. తమ బండారం బయటపడుతుందన్నఆందోళనతోనే విపక్షాలు పార్లమెంటులో చర్చ జరగకుండా అడ్డుకుని సభ నుంచి పారిపోయాయని మండిపడ్డారు. అవినీతి, నల్లడబ్బుపై జరగాల్సిన చర్చ నుంచి విపక్షాలు పారిపోయాయని, అవినీతి పరులకు అండగా నిలుస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.