శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 16 నవంబరు 2020 (14:37 IST)

నేడు జాతీయ పత్రికా దినోత్సవం... పత్రికా స్వేచ్ఛ కోసం..?

భారతదేశంలో ప్రతి సంవత్సరం నవంబర్ 16 వ తేదిన జాతీయ పత్రికాదినోత్సవం జరుపుకుంటారు 1956లో భారత తొలి ప్రెస్ కమిషన్ సిఫార్స్ మేరకు 1966 నవంబర్ 16 వ తేదిన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం నవంబర్ 16వ తేదిన జాతీయ పత్రికా(నేషనల్‌ ప్రెస్‌ డే) దినోత్సవాన్ని జరుపుకుంటారు.
 
ఒక దేశంలో ప్రజాస్వామ్య ము సక్రమంగా పనిచేస్తున్నదీ లేనిదీ తెలుసుకోవాలంటే ఆ దేశములో పత్రికా రంగాన్ని పరిశీలిస్తే చాలు. పత్రికా రంగము మీద ఎటువంటి ఆంక్షలు లేకుండా పత్రికా స్వాతంత్ర్యము అమలవుతుంటే ఆ దేశంలో ప్రజాస్వామ్య పాలనకు, చట్టబద్దపాలనకు ఢోకాలేనట్టే.
 
 ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికారంగాన్ని పరిశీలించటంతో పాటు వార్తల తీరుతెన్నులపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి వృత్తిపరమైన అక్రమాలకు పాల్పడిన పత్రికలు, సంస్థల చర్యలను విమర్శించటం, అభిశంసించటం, చర్యలకు సిఫార్సు చేస్తుంది. 
 
పత్రికా స్వేచ్ఛ కోసం పనిచేయాలన్నది లక్ష్యం. ప్రపంచంలో అనేక దేశాలలో ప్రెస్‌ కౌన్సిళ్లు ఉన్నాయి. అయితే మనదేశ కౌన్సిల్‌కు ఉన్న ప్రత్యేకత ఏమంటే ప్రభుత్వశాఖలపై కూడా తన అధికారాన్ని వినియోగించే అవకాశం కలిగి ఉంది. పత్రికలు, మీడియా స్వయంగా ఉన్నత ప్రమాణాలను నిర్ణయించుకొని అమలు జరిపే విధంగా ప్రెస్‌కౌన్సిల్‌ ప్రోత్సహిస్తుంది.
 
గత పన్నెండు సంవత్సరాలుగా ప్రెస్‌ కౌన్సిల్‌ పత్రికా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు, సమస్యల గురించి ప్రతి నవంబరు 16న సెమినార్లు నిర్వహిస్తున్నది. అంతర్జాతీయ మానవ హక్కుల ప్రకటనలోని 19 ఆర్టికల్‌కు అనుగుణంగా పాలకులు పత్రికా స్వేచ్ఛను కాపాడాలని, వారికి పత్రికా స్వేచ్ఛ ప్రాధాన్యతను గుర్తు చేస్తూ ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ పత్రికా స్వేచ్ఛ దినంగా మే 3వ తేదీని ప్రకటించింది.