గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సిహెచ్
Last Updated : బుధవారం, 12 జనవరి 2022 (12:33 IST)

జీవితానికి దారి చూపే స్వామి వివేకానంద సూక్తులు

జాతీయ యువజనోత్సవం. స్వామి వివేకానంద జన్మదినం సందర్భంగా జరుపుకుంటున్నాం. వివేకానందుడు చెప్పిన సూక్తులు యువతకు దారి చూపుతాయి. దిశానిర్దేశం చేస్తాయి. స్వామీజీ చెప్పిన కొన్ని సూక్తులు ఇప్పుడు చూద్దాం.

 
1. ఎప్పుడూ ప్రయత్నించని వ్యక్తి కంటే ప్రయత్నించి విఫలుడైన వ్యక్తి మేలు.
2. ఎప్పుడూ శాంతంగా, ప్రసన్నంగా ఉండటమే గొప్ప లక్షణం.
3. ఎప్పుడూ ఒకరికివ్వడం నేర్చుకో.. తీసుకోవడం కాదు.
4. ఒక సమర్ధుడి వెనుక చాలామంది సమర్ధత దాగి ఉంటుంది.
5. ఓర్పు లేని మనిషి నూనెలేని దీపం వంటివాడు.
6. మోసం చేయడం కంటే ఓటమి పొందడమే గౌరవదాయకమైన విషయం
7. అదృష్టం మనం చేసే కృషిలోనే ఉంటుంది.
8. అనుభవం వల్ల వచ్చే జ్ఞానమే అసలైన జ్ఞానం.
9. మంచి ఆరోగ్య భాగ్యమే బంగారాన్ని మించిన మహద్భాగ్యం.
10. ఒక్క క్షణం సహనం కొండంత ప్రమాదాన్ని దూరం చేస్తే ఒక్క క్షణం అసహనం మొత్తం జీవితాన్నే నాశనం చేస్తుంది.
 
- స్వామి వివేకానంద