శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 4 జనవరి 2017 (13:02 IST)

3 నెలలకోసారి రక్తదానం.. 40 యేళ్లుగా... సుప్రీం చీఫ్ జస్టీస్ ఖెహర్ గురించి తెలియని నిజం

న్యూఢిల్లీలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు ప్రతి మూడు నెలలకు ఓసారి అతిసాదాసీదాగా నడుచుకుంటూ వెళ్ళి... రక్తదానం చేస్తుంటారు. అదీ కూడా గత 40 యేళ్లుగా ఇదో దినచర్యగా మారిపోయింది. ఆ వ్యక్త

న్యూఢిల్లీలో ఉన్న అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్)కు ప్రతి మూడు నెలలకు ఓసారి అతిసాదాసీదాగా నడుచుకుంటూ వెళ్ళి... రక్తదానం చేస్తుంటారు. అదీ కూడా గత 40 యేళ్లుగా ఇదో దినచర్యగా మారిపోయింది. ఆ వ్యక్తి ఎవరో కాదు.. దేశ అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన జస్టీస్ జగదీష్ సింగ్ ఖెహర్. ఇది ఇంతవరకు ఎవరికీ తెలియని నిజం.
 
ఈయన చీఫ్ జస్టీస్‌గా బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పలువురు ప్రముఖులు హాజరయ్యారు. జేఎస్‌ ఖెహర్‌ 1952లో పంజాబ్‌లో జన్మించారు. చండీగఢ్‌ ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ, పంజాబ్‌ యూనివర్శిటీలో ఎల్‌ఎల్‌.బీ, ఎల్‌ఎల్‌.ఎమ్‌ పూర్తి చేశారు. 1999లో పంజాబ్‌, హర్యానా హైకోర్టులో న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. 
 
2008లో అదే హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2009లో ఉత్తరాఖండ్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా, 2010లో కర్ణాటక హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు నిర్వర్తించారు. సెప్టెంబర్‌ 13, 2011న సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమితులై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్‌ ఠాకూర్‌ పదవీకాలం జనవరి 3తో ముగియడంతో ఆయన స్థానంలో ఖెహర్‌ నేడు బాధ్యతలు చేపట్టారు. ఈయన 2017 ఆగస్టు 28వ తేదీ వరకు ఆ విధుల్లో కొనసాగుతారు.