శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 22 డిశెంబరు 2016 (14:53 IST)

శశికళకు నో క్రేజ్ ఎంజీఆర్ సమాధి నుంచి ''అమ్మా డీఎంకే పార్టీ'' ఆవిర్భావం..

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక.. అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా.. కార్యకర్తలు, ప్రజలు మాత్రం శశికళను అన్నాడీఎం

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కన్నుమూశాక.. అన్నాడీఎంకేలో లుకలుకలు ప్రారంభమైనాయి. నెచ్చెలి శశికళ పార్టీ పగ్గాలు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నా.. కార్యకర్తలు, ప్రజలు మాత్రం శశికళను అన్నాడీఎంకే అధినేత్రిగా చూసేందుకు ఇష్టపడట్లేదు. ఈ నేపథ్యంలో శశికళకు పార్టీ సీనియర్లు మాత్రమే మద్దతు పలుకుతున్నారు. కార్యకర్తలు శశికళ అంటేనే మండిపడుతున్నారు. దీంతో అమ్మ పేరిట కొత్త పార్టీని ప్రారంభించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు తమిళనాట జోరుగా చర్చ సాగుతోంది. 
 
ఈ పార్టీకి అమ్మా డీఎంకే అనే పేరు పెడతారని తెలుస్తోంది. ఈ పార్టీని ఈ నెల 24వ తేదీ ఎంజీఆర్ సమాధి నుంచి ప్రారంభించాలని కార్యకర్తలు భావిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన శుక్రవారం విడుదలయ్యే అవకాశం ఉంది. తమిళనాడు కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ సోదరుడు ఇనియన్ సంబత్ ఈ పార్టీకి నేతృత్వం వహిస్తారని తెలుస్తోంది. అమ్మా డీఎంకే పేరిట ప్రారంభం కానున్న ఈ పార్టీకి కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆదరిస్తారని తెలుస్తోంది.