1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 9 మే 2016 (13:49 IST)

రాహుల్ - అఖిలేష్ - మాయావతిలు గాడిదలు... యూపీలో పోస్టర్ కలకలం

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని గోరఖ్‌పూర్‌లోని పలు వీధుల్లోని గోడలకు అంటించిన పోస్టర్ కలకలం రేపుతోంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌తో పాటు... కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతిలను గాడిదలతో పోల్చుతూ ఈ పోస్టర్లు అంటించారు. ఇవి ఇపుడు పెను కలకలం సృష్టిస్తున్నాయి. 
 
అలాగే, హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీని కూడా ఆ పోస్టర్‌లో వదలలేదు. ఒవైసీని కూడా గాడిదగా అభిర్ణించిన మైనారిటీ నేతలు... బీజేపీ ఎంపీ యోగి ఆదిత్యనాథ్‌ను మాత్రం పులిగా అభివర్ణించారు. ఓ వైపు యోగిని పులిగా అభివర్ణిస్తూనే... పులి బొమ్మ వెనుక ఆయన ఫొటోను ముద్రించారు. మరోవైపు రాహుల్, మాయావతి, అఖిలేశ్, ఒవైసీలను గాడిదలుగ చూపిస్తూ వారి ఫొటోలకు గాడిదల బొమ్మలను అతికించారు. ఈ పోస్టర్ అక్కడ దుమారం రేపుతోంది.