1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 25 ఆగస్టు 2016 (10:31 IST)

నిర్భయ కేసు నిందితుడు వినయ్ శర్మ ఆత్మహత్యాయత్నం.. ఎందుకు?

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడైన వినయ్ శర్మ ఢిల్లీలోని తీహార్ జైలులో గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. న్యూఢిల్లీ శివార్లలో నడుస్తున్న బస్సులో 2012 డిసెంబరు నెలలో నిర్

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసులో నిందితుడైన వినయ్ శర్మ ఢిల్లీలోని తీహార్ జైలులో గురువారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు.  న్యూఢిల్లీ శివార్లలో నడుస్తున్న బస్సులో 2012 డిసెంబరు నెలలో నిర్భయపై సహచరులతో కలిసి సామూహిక అత్యాచారం చేశాడు. ఈ కేసులో వినయ్ శర్మకు కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించిన సంగతి తెలిసిందే. 
 
జైలు అధికారులు ప్రాణాపాయ స్థితిలో ఉన్న వినయ్ శర్మను ఆసుపత్రికి తరలించారు. తీహార్ జైలులో ఉన్న తోటి ఖైదీలు, పోలీసులు తనపై దాడులు చేస్తున్నారని శర్మ గత ఏడాది ఆరోపించారు. తనకు జైలులో అదనంగా భద్రత కల్పించాలని కోరాడు.
 
నిర్భయ కేసులో మరణ శిక్ష పడ్డ వినయ్ శర్మ… ప్రస్తుతం తీహార్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు. మరణశిక్షపై ప్రస్తుతం పై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం వినయ్ శర్మ... ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు జైలు అధికారులు చెప్పారు. ప్రస్తుతం అతనికి ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. 2013లో ఇదే కేసులో నిందితుడిగా ఉన్న రామ్ సింగ్ కూడా తీహార్ జైల్లో ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే.