గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 20 జులై 2020 (14:50 IST)

లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం... భర్తకు తెలిసినా...

కరోనా వైరస్ కారణంగా దేశంలో రెండు నెలల పాటు లాక్డౌన్ అమలు చేశారు. ఆ సమయంలో ప్రతి ఒక్కరూ తమతమ ఇళ్లకే పరిమితమయ్యారు. అయితే, పలు ప్రాంతాల్లో ఈ లాక్డౌన్ సమయంలో మహిళలపై అత్యాచారాలు, అఘాయిత్యాలు జరిగాయి. అలాంటి ఘటన ఒకటి నోయిడాలో జరిగింది. లాక్డౌన్ వేళ కోడలిపై మామ అత్యాచారం చేశాడు. ఈ విషయం భర్తకు చెప్పినా అతను నోరు మెదపలేదు. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రేటర్ నోయిడాలోని పూర్వాంచల్ హైట్స్ సొసైటీలో నివాసముంటున్న ఓ ఇంటి మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు గత యేడాది వివాహం జరిగింది. అప్పటి నుంచి అత్తమామలతో కలిసి తాను తన భర్త ఉంటున్నాం. 
 
అయితే, పెళ్ళన కొత్తలో తనపై మామ అత్యాచారం జరిపాడు. ఆ తర్వాత జూన్ నెలలోనూ మళ్లీ మామ తనపై లైంగిక దాడికి యత్నించాడు. ఈ విషయాన్ని తన భర్త, అత్తల దృష్టికి తీసుకెళ్తే ఆయన మిన్నకుండిపోయాడు. 
 
దీంతో సెక్టార్ బేటా 2లోని తన పుట్టింటికి ఆ కోడలు వెళ్లిపోయింది. దీనిపై కోడలి ఫిర్యాదుతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 498 ఎ, 323, 504, 506, 342 354 376 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నోయిడా డీసీపీ బృందా శుక్లా చెప్పారు.