గురువారం, 9 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 4 మార్చి 2017 (19:18 IST)

కోతులు - గ్రామస్థుల యుద్ధం... స్కూళ్లు... ఆస్పత్రులు.. దుకాణాలు.. అన్నీబంద్

వానరం... ఆంజనేయస్వామిగా భావించి భక్తులు పూజిస్తారు. కానీ, కొన్ని కోతుల గుంపు మనుషులతో యుద్ధం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వచ్చి లొల్లి చేస్తుంటడంతో ఆ గ్రామవాసులకు కంటిమీద

వానరం... ఆంజనేయస్వామిగా భావించి భక్తులు పూజిస్తారు. కానీ, కొన్ని కోతుల గుంపు మనుషులతో యుద్ధం చేస్తున్నాయి. పగలు, రాత్రి అనే తేడా లేకుండా జనావాసాల్లోకి వచ్చి లొల్లి చేస్తుంటడంతో ఆ గ్రామవాసులకు కంటిమీద కునుకు కరువైంది. దీంతో పాఠశాలలు, దుకాణాలు, ఆస్పత్రులన్నీ మూతపడ్డాయి. ఈ వింత పరిస్థితి ఒడిషా రాష్ట్రంలోని కేంద్రపర జిల్లా ఖమ గ్రామంలో నెలకొనివుంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఖమ గ్రామానికి వందల సంఖ్యలో కోతులు ప్రవేశించాయి. అవి గంపులుగుంపులుగా వచ్చి స్థానికులపై దాడికి చేస్తున్నాయి. అంతేనా... ఇళ్లు, ప్రార్థనా స్థలాలు, స్కూళ్లు, పార్కులు, మార్కెట్లు ఎక్కడ చూసినా కోతుల గుంపులే. వీటి కంటికి కనపడినవి ఎత్తుకుపోవడం వంటి షరామూమూలై పోయాయి. ఏమాత్రం ఆదమరచినా దాడులు, కరవడాలు నిత్యకృత్యమయ్యాయి. గత కొద్దిరోజులుగా ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, స్కూళ్లు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఆస్పత్రులు కూడా మూతపడ్డాయి. దీంతో ఆ గ్రామస్థులు కంటినిండా నిద్రపోయి పక్షం రోజులైంది. 
 
పైగా, పిల్లల్ని బయటకి పంపాలంటేనే బెంబేలెత్తిపోతున్నారు. దీంతో కోతులపై అమీతుమీకి సిద్ధపడిన ప్రజలు శనివారం తమ ఆందోళనను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువ్చచేందుకు రోడ్లపై బైఠాయించారు. దీంతో కటక్-చాంద్‌బల్లి స్టేట్ హైవేపై వాహనాల రాకపోకలు దాదాపు గంటసేపు నిలిచిపోయాయి. గ్రామం నుంచి కోతులను తరమికొట్టాలనే ఏకైక డిమాండ్‌తో జనం ఆందోళనకు దిగడంతో అధికారులు రంగప్రవేశం చేసి వారికి నచ్చజెప్పి ఆందోళన విరమించేలా చేశారు.