శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 24 డిశెంబరు 2021 (14:29 IST)

ఒమిక్రాన్: ఆన్‌లైన్ వివాహానికి కోర్టు గ్రీన్ సిగ్నల్

ఒమిక్రాన్ నేపథ్యంలో కేరళకు చెందిన న్యాయవాది పెళ్లి ఆగిపోయింది. వారి వివాహానికి ఒమిక్రాన్ అడ్డు పడింది. వివరాల్లోకి వెళితే.. కేరళకు చెందిన న్యాయవాది రింటు థామస్ (25), అనంత కృష్ణన్ హరికుమార్ నాయర్‌లు గురువారంపెళ్లి చేసుకుని దాంపత్య జీవితంలోకి అడుగుపెట్టాలని భావించారు. కానీ ఒమిక్రాన్ నేఫథ్యంలో ప్రయాణ ఆంక్షలు వుండటంతో రాలేకపోయారు. ఫలితంగా వీరి వివాహం ఆగిపోయింది. 
 
దీంతో రింటు కేరళ హైకోర్టును ఆశ్రయించారు. ఆన్‌లైన్‌లో వివాహం చేసుకునేందుకు అనుమతించేలా  రాష్ట్ర ప్రభుత్వం, తిరువనంతపురంలోని సబ్ రిజిస్ట్రార్‌లను ఆదేశించాలని అభ్యర్థించారు. ఆమె పిటిషన్‌ను పరిశీలించిన న్యాయమూర్తి జస్టిస్ ఎన్.నగరేశ్ అందుకు అంగీకరించారు. 
 
కరోనా సమయంలో ఆన్‌లైన్ వివాహాలకు అనుమతినిచ్చిన నేపథ్యంలో ఇప్పుడు కూడా దానిని అమలు చేయవచ్చని తెలిపారు. వారి పెళ్లికి తగిన ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.