మంగళవారం, 10 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 19 ఆగస్టు 2024 (12:15 IST)

ఛాతిలో నొప్పి.. డాక్టర్ చెక్ చేస్తుండగానే కుప్పకూలిన ఆటో డ్రైవర్.. ఏమైంది? (video)

Doctor
Doctor
మధ్యప్రదేశ్‌ ఇండోర్‌లో గుండెపోటుతో ఓ వ్యక్తి మరణించాడు. గుండెపోటుతో మరణించడం సాధారణమే కదా అనుకునేరు. ఆస్పత్రిలో చేరిన ఆ వ్యక్తిని వైద్యుడు పరీక్షిస్తుండగా వున్నట్టుండి కుప్పకూలిపోయాడు. ఛాతిలో నొప్పిగా వుందని ఆస్పత్రికి వెళ్లాడు ఓ ఆటో డ్రైవర్. 
 
చికిత్స కోసం క్లినిక్‌కు వెళ్లిన అతనిని వైద్యుడు పరీక్షిస్తుండగానే కుప్పకూలిపోయాడు. ఏం జరిగిందనుకునేలోపే ఆ ఆటో డ్రైవర్ గుండె ఆగిపోయింది. 
 
ఈ ఘటన సీసీటీవీలో రికార్డయింది. ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. మరణించిన వ్యక్తి పేరు సోనూ అని తెలిసింది. ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.