ఒక రోజున బీజేపీకి అదేగతి పడుతుంది : ప్రియాంకా జోస్యం

priyanka gandhi
Last Updated: బుధవారం, 24 జులై 2019 (15:01 IST)
రాష్ట్రంలో సాఫీగా సాగిపోతున్న కాంగ్రెస్ - జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చి బీజేపీ అధికారంలోకి రానుంది. దీనిపై కాంగ్రెస్ మహిళా నేత ప్రియాంకా గాంధీ స్పందించారు. ఒక రోజున బీజేపీ సర్కారు కూడా కుప్పకూలిపోతుందని జోస్యం చెప్పారు.

కర్నాటక ముఖ్యమంత్రిగా ఉన్న హెచ్.డి. కుమార స్వామికి వ్యతిరేకంగా ఓ స్వతంత్ర ఎమ్మెల్యేతో పాటు కాంగ్రెస్‌కు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెల్సిందే. దీంతో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో కుమార్ స్వామి ప్రభుత్వం కూలిపోయింది.

ఫలితంగా కుమార స్వామి తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అదేసమయంలో ఈ నెల 25వ తేదీన కర్నాటక రాష్ట్ర ముఖ్యమంత్రిగా బీఎస్. యడ్యూరప్ప ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

దీనిపై ప్రియాంకా గాంధీ స్పందిస్తూ, అన్నింటినీ డబ్బులకు కొనుగోలు చేయలేమనే నిజాన్ని బీజేపీ ఓ రోజున గ్రహిస్తుందన్నారు. బీజేపీ నేతలు చెప్పే అబద్ధాలన్నీ ఒక రోజున బహిర్గతమవుతుయని చెప్పారు. అప్పటికు వరకు ఈ దేశ ప్రజలు తమను తాము కాపాడుకోవాలని ఆమె వ్యాఖ్యానించారు.

కాగా, 225 సభ్యులు కలిగిన కర్నాటక అసెంబ్లీలో మంగళవారం రాత్రి జరిగిన విశ్వాస పరీక్షలో అధికార కాంగ్రెస్ - జేడీఎస్ సర్కారుకు అనుకూలంగా 99 ఓట్లు రాగా, విపక్ష బీజేపీకి 105 సీట్లు వచ్చాయి.దీనిపై మరింత చదవండి :