శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 15 డిశెంబరు 2024 (17:53 IST)

వన్ నేషన్ - వన్ ఎలక్షన్‌పై కేంద్రం వెనక్కి తగ్గిందా?

one nation - one election
ఒకే దేశం - ఒకే ఎన్నిక (వన్ నేషన్ - వన్ ఎలక్షన్)పై కేంద్రం ప్రభుత్వం వెనక్కి తగ్గినట్టు వార్తలు వస్తున్నాయి. ఈ బిల్లును తాజాగా జరిగిన కేంద్ర మంత్రివర్గంలో ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది. ఆ తర్వాత సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టాలని భావించారు. ఈ నేపథ్యంలో కీలక పరిణాణం చోటు చేసుకుంది. సోమవారం లోక్‌సభలో ప్రవేశపెట్టబోతున్నట్టు ప్రచారం కూడా సాగింది. ఇంతలోనే కేంద్రం వెనక్కి తగ్గింది. 
 
లోక్‌సభ సోమవారం బిజినెస్ అజెండా నుంచి వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లులను తొలగించింది. ఈ మేరకు అప్డేట్ చేసిన లిస్టులో ఈ బిల్లులు కనిపించడం లేదు. దీంతో ఈ బిల్లులు చట్టసభల ముందుకు రావడంపై సందిగ్ధత నెలకొంది.
 
కాగా, ఈ బిల్లులను కేంద్రమంత్రి అర్జున్ రామ్ మేఘవాల్ సోమవారం సభలో ప్రవేశపెడతారని ప్రభుత్వం ఇటీవలే ప్రకటించింది. ఆ మేరకు లిస్టులో కూడా చేర్చింది. అవగాహన కోసం ఎంపీలకు బిల్లుల కాపీలను సైతం పంపిణీ చేసింది. అంతలోనే ఈ పరిణామం చేసుకోవడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
 
ఈ బిల్లులను తిరిగి ఎప్పుడు సభలో ప్రవేశపెడతారనే విషయంపై కూడా ఎలాంటి సమాచారం లేదు. డిసెంబరు 20తో ప్రస్తుత పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ముగియనున్నాయి. సోమవారాన్ని మినహాయిస్తే మరో నాలుగు రోజులే మిగిలి ఉంటాయి. మరి ఈ సెషన్‌లోనే సభ ముందుకు బిల్లులను తీసుకొస్తారా... లేదా? అనేది తెలియాల్సి ఉంది.