శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 10 ఆగస్టు 2019 (08:56 IST)

హైదరాబాద్ లో ‘వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు’

తెలంగాణలో ”వన్‌ నేషన్‌ వన్‌ రేషన్‌ కార్డు” విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. ఏపీ ప్రజలు తెలంగాణలో రేషన్ సరుకులు తీసుకోవాలంటే వీలైయ్యేది కాదు. ఇకపై అలాంటి కష్టాలు ఉండవు. రెండు రాష్ట్రాల ప్రజలు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునే అవకాశం కలిగింది.

ఈ క్రమంలో హైదరాబాద్ లో ‘వన్‌ నేషన్‌- వన్‌ రేషన్‌ కార్డు’ విధానం ప్రయోగాత్మకంగా ప్రారంభమైంది. రాంవిలాస్ పాశ్వాన్ ఢిల్లీ నుంచి కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం ప్రారంభోత్సవంలో పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ అకున్‌ సబర్వాల్‌ పాల్గొన్నారు.

రెండు రాష్ట్రాల్లో ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునే విధంగా రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా ‘వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌’ కార్డు విధానం అమలు చేస్తున్నట్లు తెలిపారు. నేషనల్‌ పోర్టబులిటీ తెలంగాణ, ఏపీ క్లస్టర్‌ ద్వారా సేవలందించనున్నట్టు తెలిపారు. దీంతో హైదరాబాద్‌లో ఉంటున్న ఏపీ వాసులకు ఎక్కువగా లబ్ధి చేకూరుతుందన్నారు.
 
 బతుకుదెరువు కోసం నగరానికి వచ్చిన మధ్యతరగతి ప్రజలు సొంత రాష్ట్రం ఏపీలో రేషన్ సరుకులకు దూరం అవుతున్నారన్నారు. ఇక్కడే పనులు చేసుకుని బతకడంతో అక్కడ రేషన్ తీసుకోలేని పరిస్థితి ఏర్పడిందని.. ఇకపై వారంతా ఏపీ రేషన్ కార్డుతో హైదరాబాద్‌లోనే సరుకులు తీసుకోవచ్చని చెప్పారు.

తెలంగాణలో ప్రయోగాత్మకంగా ప్రారంభమై వన్ నేషన్ వన్ రేషన్ కార్డు పథకం త్వరలోనే అన్ని రాష్ట్రాల్లో పూర్తి స్థాయిలో అమలు కానున్నట్లు తెలిపారు అకున్ సబర్వాల్.