సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By TJ
Last Modified: మంగళవారం, 3 అక్టోబరు 2017 (13:21 IST)

మళ్లీ మొదటికొచ్చిన ఓపిఎస్ - ఇపిఎస్.. అదీ శ్రీవారి చెంతే..!

అన్నాడిఎంకేలో బద్ధశత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కలిసిపోయారు. దీంతో కథ సుఖాంతమైందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య ఆ వైరం అలాగే కొనసాగుతోంది. అది కాస్త తిరుమలలో బయటపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరు సెల్వంలు వేర్వేరుగా తి

అన్నాడిఎంకేలో బద్ధశత్రువులుగా ఉన్న పళణిస్వామి, పన్నీరుసెల్వంలు కలిసిపోయారు. దీంతో కథ సుఖాంతమైందని అందరూ భావించారు. కానీ వీరి మధ్య ఆ వైరం అలాగే కొనసాగుతోంది. అది కాస్త తిరుమలలో బయటపడింది. తమిళనాడు ముఖ్యమంత్రి పళణిస్వామి, పన్నీరు సెల్వంలు వేర్వేరుగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. 
 
పళణిస్వామి అష్టదళ పాదపద్మారాధన సేవలో స్వామి సేవలో పాల్గొనగా, పన్నీరుసెల్వం సుప్రభాత సేవలో పాల్గొన్నారు. పన్నీరు సెల్వం నిన్నటి నుంచే తిరుమలలో ఉన్నారు. నిన్న ఉదయం విఐపి విరామ దర్శనా సమయంలో స్వామివారిని దర్శించుకున్నారు.
 
నిన్న సాయంత్రం తిరుమలకు వచ్చిన పళణిస్వామితో అస్సలు మాట్లాడలేదు పన్నీరుసెల్వం. ఎవరికివారు విడివిడిగా ఉంటున్నారు. ఇద్దరూ కలిసి నడుపుతున్న ప్రభుత్వంలో ఓపిఎస్, ఇపిఎస్ ఎడముఖం, పెడముఖంగా ఉండటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.