మంగళసూత్రంలో పగడం ధరిస్తే భర్త ఇక పైకే...?
కర్ణాటకలో కొంతమంది మహిళలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలకొట్టుకుంటున్నారట. పగడం ధరిస్తే రాత్రుళ్లు నిద్ర పట్టదని, మంచిది కాదని, భర్త చనిపోతాడనే పుకార్లు బళ్లారి, దావణగిరి, చిత్రదుర్గ, తుమ్కూరులో కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో, మహిళలు తమ తాళిబొ
కర్ణాటకలో కొంతమంది మహిళలు తమ తాళిబొట్లలోని పగడాలను పగలకొట్టుకుంటున్నారట. పగడం ధరిస్తే రాత్రుళ్లు నిద్ర పట్టదని, మంచిది కాదని, భర్త చనిపోతాడనే పుకార్లు బళ్లారి, దావణగిరి, చిత్రదుర్గ, తుమ్కూరులో కొన్ని రోజులుగా వినిపిస్తున్నాయి. దీంతో, మహిళలు తమ తాళిబొట్లలో ఉన్న పగడాలను పగలగొట్టుకోవడం విడ్డూరంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ పుకార్లు కర్ణాటక సమీపంలోని రాయదుర్గంతో పాటు పలు ప్రాంతాలకు వ్యాపించాయి.
ఈ పుకార్లు విన్న పలువురు తమ సమీప బంధువులకు ఫోన్ ద్వారా సమాచారం అందిస్తూ మరింత వ్యాప్తి చేస్తున్నారు. ఇలా కర్ణాటక రాష్ట్రం మొత్తం ఈ విషయం కాస్తా పాకిపోవడంతో మహిళలు భయపడిపోతున్నారట. కొంతమంది పగడాలను పగులగొడితే మరికొంతమంది మంగళసూత్రం నుంచి పగడాన్ని తీసి పక్కన పడేస్తున్నారు.